యోగి వేమన విశ్వవిద్యాలయం అనువర్తిత గణిత శాస్త్ర పరిశోధకుడు పరాల వెంకట సుబ్రహ్మణ్యంకు అనువర్తిత గణిత శాస్త్ర విభాగంలో విశ్వవిద్యాలయం గురువారం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కాత్యాయని పర్యవేక్షణలో అప్లైడ్ మ్యాథ్స్ లో "కన్వెక్టివ్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ ఫ్లో ఆఫ్ నానోఫ్లూయడ్స్" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కె. ఎస్. వి. కృష్ణారావు ప్రకటించారు.