వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.. సోమవారం కమలాపురం తాహసిల్దార్ శివరాం రెడ్డికి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలంటూ సంఘం గౌరవ అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. నామినీ వీఆర్ఎలను, వీఆర్ఎలుగా గుర్తించాలని కోరారు. వీఆర్ఏలకు పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాజేష్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.