అవినీతి నిర్మూలించి సమాజాన్ని మారుద్దాం అని కడప నాబార్డ్ ఏజిమ్ బి. విజయ విహారి అన్నారు. సోమవారం నెహ్రు యువ కేంద్ర కడప శాఖ ఆదేశాల మేరకు మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కమలాపురం ప్రగతి జూనియర్ కళాశాలలో అవినీతి నిర్మూలన వారోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల కరస్పాండెట్ ఆర్ రాఘవ రెడ్డి, మదర్ థెరీసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ జూటురు విజయ్ కుమార్ పాల్గొన్నారు.