గ్రామ సభల ద్వారా గ్రామాల్లోని సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పి. కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. శుక్రవారం వల్లూరులో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీలో రూ. 40 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నాగేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో, తహాసిల్దార్, ఎస్సై, ప్రజలు పాల్గొన్నారు.