దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలు ప్రకారం విక్రయాలు చేయాలని సూచించారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాల వద్ద ప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.