బద్వేలులోని స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం బద్వేలు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ 1974 నుండి 2024 వరకు భారతదేశంలో విద్యార్థి దశ నుండి మరణించేవరకు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు.