టిడ్కో ఇండ్ల నిర్మాణంపై ప్రజలను గతంలో జగన్ సర్కార్ దారుణంగా మోసం చేసిందని శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్ కేమో వందల కోట్ల ప్యాలెస్లు, పేద ప్రజలకు సెంటు స్థలంలో ఇండ్ల నిర్మాణమా? ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పేద ప్రజల గృహ నిర్మాణాలపై గత సర్కార్ చేసిన నిర్లక్ష్యానికి నిదర్శనం టీడ్కో ఇండ్లేనన్నారు.