కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో జనసేనకు పార్టీకి స్థానం కల్పించారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు చిలకలపూడి పాపారావును శనివారం ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. తనను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాపారావు కృతజ్ఞతలు తెలిపారు.