ప్రభుత్వాన్ని కించపరుస్తూ రాజకీయ నాయకుల గౌరవాన్ని దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తిరుమల కృష్ణ అనే వ్యక్తిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. రాంబొట్లపాలెం గ్రామానికి చెందిన అలుమోలు దుర్గారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సామాజిక మాధ్యమాలలో ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.