చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో దీపావళి పండుగ రోజున జరిగిన అగ్ని ప్రమాదంలో నివాసాన్ని కోల్పోయిన చిముటూరి జ్వాలా నరసింహారావు కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు.ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు కూటమి శ్రేణులు కార్యకర్తలు పాల్గొనినారు.