పెదకూరపాడు మండల పరిధిలోని పలు గ్రామాలకు శుక్రవారం విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ నిలిపివేయడంతో పెదకూరపాడు పేరమ్మ వాగు వద్ద ప్రజలు పెద్ద ఎత్తున శుక్రవారం రాత్రి సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచారం లేకుండా కరెంటు నిలిపివేయడంతో పసి పిల్లలు, వృద్ధులు, బాలింతలు ఇబ్బందులు గురవుతున్నారన్నారు.