పర్చూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏ. డి రమేష్ వెల్లడించారు. సాధారణ మరమ్మత్తులో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, విద్యుత్ వినియోగదారులు అర్థం చేసుకొని విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.