ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ పర్చూరులో ఐదు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలోని పేర్లు చదివి వినిపించాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలని ఆయన వారిని ఆదేశించారు.18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు.