ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.