పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపటి నుంచి వికేంద్రీకరణ చేపడుతున్నట్లు పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు ఆదివారం ప్రకటించారు. వికేంద్రీకరణలో భాగంగా మున్సిపల్, మండల స్థాయి కార్యాలయాలలో కూడా పిజిఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు తమ మండలాలలోని తహశీల్దార్ కార్యాలయాలలో, పట్టణాలలోని మున్సిపల్ కార్యాలయాలలో తమ అర్జీలను అధికారులకు అందజేయాలని సూచించారు.