మంత్రి నారా లోకేశ్ ఆదేశానుసారం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. గురువారం మంగళగిరి కుప్పురావు కాలనీకి చెందిన అందే సరోజిని రూ. 5 లక్షల 50 వేలు, 22వ వార్డుకు చెందిన నమస్వికి రూ. 1, 05, 917, 24వ వార్డులోని మండ్రు సామ్రాజ్యంకు రూ. 1, 08, 600 చెక్కులు మంజూరు చేయగా టీడీపీ నాయకులు స్వయంగా అందించారు. సీఎం సహాయ నిధి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ అబద్దయ్య అన్నారు.