పిడుగురాళ్లలో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పలువురు టీడీపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బి. ఆర్ నాయుడుపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.