గుంటూరులో ఇన్సూరెన్స్ ఉద్యోగి పులిగడ్డ రాజేష్ పై కత్తితో దాడి చేసిన ఘటనలో కందుల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్సూరెన్స్ సంబంధించిన పాత్రలలో పేరు తప్పు ఉండటంతో రాజేష్ పై శ్రీనివాస్ కక్ష పెంచుకుని, మంగళవారం కత్తితో రాజేష్ పై దాడి చేశాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ సలీం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ ను ఆపే క్రమంలో పోలీసులపై కూడా నిందితుడు దాడికి తెగబడ్డాడు.