గుంటూరులో ఓ వ్యక్తి వద్ద రూ. 50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం గుంటూరు పోలీసులు మంగళవారం అనిల్ ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.