విద్యుత్ లైన్ల నిర్వహణలోభాగంగా శనివారం డీ 13 సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డిప్యూటీ ఈఈ పీహెచ్ ఖాన్ తెలిపారు. నందివెలుగు రోడు, గాంధీనగర్, ఆర్టీసీ కాలనీ, నవభారత కాలనీ, రాఘవనగర్, ధనమ్మ హోటల్ సెంటర్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.