తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకు పదవులు దక్కుతాయని చెప్పడానికి తనకు దక్కిన పదవే సాక్ష్యమని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. గుంటూరులోని రైలుపేటలోని టీడీపీ అర్బన్ పార్టీ కార్యాలయంలో శనివారం డేగల మాట్లాడారు. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి ఎదురు లేదన్నారు. డేగలకు పదవి దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు.