శంకరపల్లి వెంకటచలపతి కాలనీలోని ఎస్సీ హాస్టల్లో సూసైడ్ చేసుకున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. హాస్టల్లోని వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో భోజనం బాగోలేదని పలుమార్లు కంప్లెంట్ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకుంటామని కన్నా హామీ ఇచ్చారు.