చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఇది మంచి ప్రభుత్వమంటూ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలంలోని గుత్తావారిపాలెం, కారుచోల గ్రామాలలో రూ. 22 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి మంగళవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.