అద్దంకి మండలం కుంకుపాడు గ్రామంలో ఓ మహిళ అక్రమంగా మద్యం అమ్ముతుందనే సమాచారంతో ఆదివారం రాత్రి ఎక్సైజ్ సీఐ భవాని ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఆమె వద్ద నుంచి 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భవాని చెప్పారు. అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సీఐ పేర్కొన్నారు.