అద్దంకి పట్టణంలోని ఆర్టీస బస్టాండ్ ను శుక్రవారం రాత్రి ఎస్సై ఖాదర్ భాషా పరిశీలించారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికుల నుంచి వారి వివరాలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైట్ పెట్రోలింగ్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణం మొత్తం జల్లెడ పట్టినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలియజేశారు.