అద్దంకిలో గుండ్లకమ్మలో గురువారం ఈత కొట్టేందుకు తన ముగ్గురు సహజర ఫోటోగ్రాఫర్లతో పాటు వెళ్లి గల్లంతయిన ముండ్లమూరు మండలం బట్లపల్లి గ్రామానికి చెందిన తేలుకుట్ల నారాయణ మృతదేహాన్ని ఎట్టకేలకు శుక్రవారం గజ ఈతగాళ్లు బయటకు తీశారు. ఉదయం నుంచి పోలీసులు శ్రమించి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.