తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ బండి శేషన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్, వీధిలైట్లు గురించి ఎక్కువగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతిరోజు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.