గుంటూరు: అప్పుల బాధ తాళలేక మహిళా సూసైడ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అప్పుల బాధ తాళలేక ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు ప్రగతినగర్ కు చెందిన శివపార్వతి (43) జీఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమెకు తెలిసిన వారి నుంచి రూ. 7 లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఈ నెల 6న ఎలుకల మందు తిని చికిత్స పొందుతూ బుధవారం మరణించింది.