జో రూట్‌ డబుల్‌ సెంచరీ.. సచిన్‌ రికార్డు సమం (వీడియో)

64பார்த்தது
ముల్తాన్ వేదిక‌గా పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 305 బంతుల్లో రూట్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఇది రూట్ కు టెస్టుల్లో ఆరోది. ఈ క్రమంలో సచిన్, మియాందాద్, పాంటింగ్, విలియమ్సన్, ఆటపట్టు, సెహ్వాగ్, యూనిస్ ఖాన్ (6 డబుల్ సెంచరీలు) ల సరసన ఆయన చేరారు. మరోవైపు ఇంగ్లండ్ తరఫున అత్యధిక ద్విశతకాలు బాదిన రెండో ప్లేయర్ గానూ రూట్ నిలిచారు. అగ్ర స్థానంలో హామండ్ (7) ఉన్నారు.

தொடர்புடைய செய்தி