ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న క్షేత్ర పాలకుడైన భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం జ్వాలా తోరణం మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణలతో మార్మోగింది.