ఉంగుటూరు తపాలా కార్యాలయంలో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఖాతాదారుల సొమ్మును స్వయంగా వాడుకున్న ఈ వ్యక్తి, ఖాతాదారులు డబ్బు దాచుకుంటున్న సమయంలో ఆర్డీ (రికరింగ్ డిపాజిట్లు) కట్టే డబ్బులను కూడా వాడుకుంటున్నాడు. ఖాతాదారులు అతడిపై నమ్మకంతో సరేనని ఊరుకున్నారు. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో తేడా కనిపించడంతో కొందరు ఖాతాదారులు పోస్ట్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.