గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు సుమారు 30 మంది ఆదివారం ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువా కప్పివారిని జనసేన పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. వైసీపీ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాల కారణంగా నాయకులంతా వైసీపీ నే వీడుతున్నారని అన్నారు.