రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మనజిర్ జిలానీ సమూన్ శుక్రవారం భీమడోలు మండలంలో పర్యటించారు. తొలుత పాతూరు వద్ద గల పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి గోదామును పరిశీలించారు. అక్కడ పనితీరు గురించి జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, సివిల్ సప్లైయ్స్ డీఎం శ్రీలక్ష్మి ఎండీకి వివరించారు. అనంతరం పోలసానిపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి వివిధ విభాగాల పనితీరు పరిశీలించారు.