ఉంగుటూరు గ్రామంలోని కసానిగుంట చెరువు ఆక్రమణకు గురవుతోంది. చెరువుకు ఆనుకుని ఉన్న కాలువ పూర్తిగా కనుమరుగైంది. ప్రభుత్వ రికార్డుల్లో కాలువ, రోడ్డు ఉండగా, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. సుమారు ఒక ఎకరం ప్రభుత్వ చెరువు ఆక్రమితమైంది. ఈ అంశంపై ప్రజలు ఫిర్యాదులను పరిష్కార వేదికలో నమోదు చేశారు. చెరువు, కాలువ, రోడ్డు సరిహద్దులను సర్వే చేసి చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.