వరద బాధితులకు విద్యార్థులు రూ. 11వేలు విరాళం

77பார்த்தது
వరద బాధితులకు విద్యార్థులు రూ. 11వేలు విరాళం
విజయవాడ వరద బాధితుల కోసం ఉంగుటూరు ఎంపీపీ స్కూల్ విద్యార్థులు వసూలు చేసిన 11 వేల రూపాయల డీడీ ని మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. విద్యార్థులు వరద బాధితుల సహాయం కోసం వారి పాకెట్ మనీతో పాటు ఇంటింటికి తిరిగి 11 వేల రూపాయలు విరాళాలను సేకరించారు. చిన్న చేతులతో పెద్ద సహాయాన్ని చేసిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అభినందించారు.

தொடர்புடைய செய்தி