పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు గురువారం రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గవర్నర్‌ను కలవడం జరిగిందని కనుమూరు రఘు రామకృష్ణంరాజు తెలిపారు.