ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామం నందు, సచివాలయ ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఎగరవేసిన జాతీయ జెండాకు అవమానం జరిగింది. శుక్రవారం జెండాను తిరగేసి ఎగరేసిన గ్రామ ప్రధాన పౌరుడు, పొరపాటును గమనించి వెంటనే ధాని సరిచేశారు. ఈ లోపే ఫోటో బయటకు రావడంతో జాతీయ జెండాకు ఇంత అవమానమా అంటూ నేటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.