తిరువూరు మండలంలోని కోకిలంపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి పి. పద్మ పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో వరికోతలు జరుగుతున్నాయి. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవచ్చని, ధాన్యం నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రైతు సేవా కేంద్ర సిబ్బందికి మానిటరింగ్ చేయాలని సూచించారు.