నూజివీడు ఆర్డీవో ఎం. వాణి మంగళవారం ముసునూరు మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని రమణక్కపేట గ్రామంలో కుమ్మరి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ వివాదంపై ఆమె స్థానికులతో మాట్లాడారు. ఈ కాలనీలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్న విషయమై ఆర్డీవోకు స్థానికులు మొరపెట్టుకున్నారు. ముసునూరు ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మార్వో రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.