నూజివీడు పట్టణంలోని వరద బాధితులకు విద్యార్థులు మంగళవారం వంట సామాగ్రి, దుప్పట్లను అందజేశారు. పెద్ద చెరువుకు గండ్లుపడి 21 కుటుంబాలు ముంపుకు గురి కావడంతో వారందరికీ విద్యార్థులు రూ. 85 వేలతో వంటపాత్రలు, దుప్పట్లు, దిండులు కొనుగోలు చేసి వాటిని శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3.50లక్షలు కూడా ఇచ్చారు. దీంతో వరద బాధితులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.