దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం కలెక్టర్ ఛాంబర్ నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు.చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామన్నారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికి కలెక్టర్ నాగరాణి శుభాకాంక్షలు తెలియజేశారు.