మచిలీపట్నం: మాతృ మరణాలను నివారించండి
మాతృ మరణాలను నివారించాలని కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగిన మూడు మాతృ మరణాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. మాతా శిశు సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ ప్రభుత్వ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారిణి గీతాభాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.