రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్యంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు అభివృద్ధిలో మార్పు చూపిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. మండవల్లి, ముదినేపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జాబితాలో కైకలూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవాలని శ్రేణులకు ఎంపీ విజ్ఞప్తి చేశారు.