మండల కేంద్రమైన మండవల్లిలో జాతీయ రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలను సోమవారం సర్పంచ్ మెండ ఝాన్సీ ఆధ్వర్యంలో తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారి ఆనుకుని కొంత మంది దుకాణాలు ఏర్పాటు చేశారు. మరి కొంత మంది ఆక్రమణకు కర్రలు పాతడం వంటి జరగడంతో గ్రామస్తులు సర్పంచ్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది సహాయంతో ఆక్రమణలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కొండలు, సిబ్బంది పాల్గొన్నారు.