నీటి సంఘాల ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో రూపొందించామని కైకలూరు తహసీల్దార్ ఎండీ. ఇబ్రహీం అన్నారు. మండలంలోని ప్రతి గ్రామ సచివాలయాల్లో సోమవారం నుంచి అర్హుల ఓటర్ల జాబితా ప్రదర్శించినట్లు తెలిపారు. రైతులు తమ అభ్యంతరాలను మంగళవారం సాయంత్రం లోపు మండల, గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు. మండలంలో ఏడు నీటి సంఘాలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయన్నారు.