ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అభ్యున్నతికి దాతలు సహాయం మరువలేనిదని ఎన్డీయే నాయకులు అన్నారు. శుక్రవారం మండవల్లి మండలం లోకుమూడి హరిజనవాడ అంగన్వాడి స్కూల్ పిల్లలకి దాత గడిదేసి విజయ్ కుమార్ కుర్చీలును అందించారు. ఎన్డీఏ నాయకులు రఫీ, రమేష్ ,నాగసాయి కూరేళ్ల జైపాల్ మోహన్ లు మాట్లాడుతూ.. దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కార్యకర్తలు సూచించారు.