పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు ఏ సమస్య ఉన్న నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.