పెదపాడు ఎస్ఐ సతీష్ కు రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 3 ఐషర్ ట్రక్కులు అదుపులోకి తీసుకున్నారు. నాయుడుగూడెం, వెంకటాపురం మరియు రాజుపేటలలో చికెన్ వ్యర్ధాలను చేపల చెరువులకు సరఫరా చేస్తున్నటువంటి వారిని అదుపులోనికి తీసుకుని డ్రైవర్లు & యజమానులు, చేపల చెరువుల యజమానులపై కేసులు నమోదు చేశారు.