నల్లజర్ల మండలం చీపురుగూడెంలో శుక్రవారం రాత్రి మేకల మందను లారీ ఢీకొని యంట్రాపాటి చంద్రయ్యకు చెందిన 30 మేకలు మృతి చెందాయి. ఈ క్రమంలో అటువైపుగా పెళ్లికి వెళ్తున్న చింతమనేని ప్రభాకర్ సంఘటన స్థలంలో ఆగి స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో ఫోన్లో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరారు. దీంతో బాధితుడు యంట్రాపాటి చంద్రయ్యకు 10 మేకలు ఇస్తానని చింతమనేని హామీ ఇచ్చారు.