జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా 86 రోజులకు గాను రూ. 45, 87, 330 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో కొండలరావు తెలిపారు. ఈ లెక్కింపు తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ. సుజన్ కుమార్ పర్యవేక్షణలో జరిగిందని అన్నారు.